పూజా రామచంద్రన్ అలాంటి ఫోటోతో సెన్సేషన్, కోలీవుడ్ కెవ్వు కేక
పాపులర్ టీవీ ప్రెజెంటర్, నటి పూజా రామచంద్రన్ టాలీవుడ్ దర్శకనిర్మాతల చూపును ఒక్కసారిగా తనవైపు తిప్పేసుకుంది. ఇంతకీ ఆమె చేసింది ఏంటయా అంటే, సంప్రదాయ దుస్తుల నుంచి బికినీతో దర్శనమివ్వడం.
ప్రముఖ తెలుగు టెలివిజన్‌లో హోస్టెస్‌గా పనిచేసిన పూజా రామచంద్రన్ తన సహోద్యోగి క్రెయిగ్ కల్లియాడ్‌తో ప్రేమలో పడ్డారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడిపోయారు. ఆ తర్వాత పూజ రామచంద్రన్ తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు.