బాహుబలిగా మారిన ట్రంప్.. ట్విట్టర్లో షేర్.. ఆ వీడియోలో మోదీ భార్య కూడా? (video)

Donald Trump
donald trump
సెల్వి| Last Updated: ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (17:13 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ పర్యటనలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 24)న ఢిల్లీ చేరుకుంటారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వటానికి భారత్ సిద్ధంగా వుంది. ఈ పర్యటనలో భాగంగా వేయికోట్ల డాలర్ల - అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల మినీ వాణిజ్య ఒప్పందం ఈ పర్యటనలో కుదిరే అవకాశం ఉండటంతో రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదనే ప్రచారం జరుగుతోంది.

అయితే, ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారీ వాణిజ్య ఒప్పందాన్ని భవిష్యత్తు కోసం దాచానని... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నది అమెరికా ఆలోచన అని చెప్పారు.

ఇదిలా ఉంటే ట్రంప్ భారత పర్యటనను పురస్కరించుకుని సోషల్ మీడియా సెటైర్లు పేలుతున్నాయి. ఫిబ్రవరి 24, 25 తేదీలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పర్యటనకు సంబంధించి హీరో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాకు చెందిన ఒక మార్ఫ్ వీడియోను తన ట్వీట్టర్‌లో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది.

భారత్‌లోని తన స్నేహితులను కలవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఆ మార్ఫ్ వీడియోలో ట్రంప్‌తో పాటు.. మెలానియా ట్రంప్, ఇవాంక ట్రంప్, జూనియర్ ట్రంప్ కూడా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో వీరితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన భార్య జశోధా బెన్ కూడా ఉన్నారు.దీనిపై మరింత చదవండి :