మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (11:46 IST)

డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు... కేసీఆర్‌కు ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 25వ తేదీన రాంనాథ్ కోవింద్‌ అమెరికా అధ్యక్షుడికి గౌరవవిందు ఇవ్వనున్నారు. ఈ విందుకు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించనున్నారు. 
 
ఇందులోభాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇంకా బీహార్, ఒడిశా, కర్ణాటక, హర్యాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు. అలాగే, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందకపోవడం గమనార్హం.