శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (14:53 IST)

అల్లుడిని ఆశీర్వదించిన 'వకీల్ సాబ్' ... ఉబ్బితబ్బిబ్బులైన చిత్ర యూనిట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో నటిస్తూ తెగబిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం అంటే మామూలు విషయం కాదు. కానీ, మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ఈ వకీల్ సాబ్ ముఖ్యఅతిథిగా వచ్చి క్లాప్ కొట్టి, హీరోహీరోయిన్లను ఆశీర్వదించి వెళ్లారు.
 
దీనిపై హీరో సాయిధరమ్ తేజా ట్వీట్ చేశారు. 'ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదాలూ సరిపోవట్లేవు. థ్యాంక్యూ సో మచ్‌ పవన్ కల్యాణ్‌ మామా..' అని పేర్కొన్నారు. దేవర కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు పవన్‌ క్లాప్‌ కొట్టారని, అందరి ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరాడు.  
 
దేవర కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజకీయ కథాంశం నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.