సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 మార్చి 2020 (22:17 IST)

పవన్ కళ్యాణ్‌తో ఇండస్ట్రీ హిట్ తీయాలని క్రిష్ కసిగా వున్నాడట...

బాలక్రిష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో పూర్తిచేసి మిగతా దర్సకులు అవాక్కయ్యేలా చేశారు క్రిష్. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తీశారాయన. అదే ఫార్ములాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి కూడా అప్లై చేస్తున్నారట క్రిష్. 
 
తెలంగాణ రీజియన్లో రాబిన్‌హుడ్‌గా పేరున్న పండుగల పాయన్న కథను ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకువస్తున్నారట. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. మణికర్ణిక క్రెడిట్‌ని కంగన రనౌత్ కొట్టేయడం.. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కావడం వంటి కారణాలతో విసిగిపోయిన క్రిష్ వీటన్నింటికి సమాధానం చెప్పాలనే కసితో ఈ చిత్ర నిర్మాణానికి రాజీ పడడం లేదట.
 
సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తపడుతున్నాడట. తన మార్కు మళ్ళీ సినిమాల్లో రావాలని... తన పేరు గతంలో లాగా మారుమ్రోగాలన్నదే ఆయన ఆలోచన. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో ఇలాంటి కథలు తీస్తే హీరోకు పేరుతో పాటు తనకు మంచి పేరు వస్తుందన్న ఆలోచనలో ఉన్నారట క్రిష్.