శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (19:00 IST)

పడకగదిలో నెమలి ఫింఛాన్ని వుంచితే.. ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా?

Peacock
నెమలి కుమార స్వామి వాహనం. నెమలిని జాతీయ పక్షి. ఆ పక్షి ఫింఛం శ్రీకృష్ణుని కిరీటంపై నిత్యం నివసిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక పరంగా చూస్తే నెమలి ఫింఛానికి ప్రత్యేకత వుంది. నెమలి పింఛాన్ని పూజగదిలో వుంచి పూజించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి. 
 
అవంతట అవే నెమలి నుంచి ఊడిన నెమలి ఫించంలనే పూజకు వాడాలి. ఇంటి వాస్తు దోషాన్ని నివృత్తి చేయాలంటే.. ఎనిమిది నెమలి ఫించములను చేర్చి.. ఓ తెలుపు రంగు దారంతో కట్టాలి. వాటిని  పూజ గదిలో వుంచి.. ''ఓం సోమాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించడం ద్వారా ఆ దోషాలు తొలగిపోతాయి. అలాగే బీరువాల్లో ఒక నెమలి ఫించాన్ని వుంచడం ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది. 
 
అప్పుల బాధలుండవు. ఇంకా నెమలి ఫించం ఇంటి ప్రధాన ద్వారంపై వుంచడం ద్వారా ప్రతికూల ఫలితాలు వుండవు. కార్యాలయాల్లో మన సీటు ముందు నెమలి ఫింఛాన్ని వుంచితే పనితీరు మెరుగుపడుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. కొత్త దంపతులు లేదా భార్యాభర్తలు తమ పడకగదిలో నెమలి ఫింఛాన్ని వుంచడం ద్వారా.. అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య ఏవైనా సమస్యలుంటే తొలగిపోతాయి. 
Peacock Feather
 
అలాగే మూడు నెమలి ఫింఛాలను చేర్చి నలుపు రంగు దారంతో కట్టి.. వక్కల పొడి నానబెట్టిన చెంబు నీటిని తీసుకుని నెమలి ఫింఛముతో ఇంటిల్లపాది చల్లుతూ.. "ఓం శనీశ్వరాయ నమః" అనే మంత్రాన్ని 21సార్లు ఉచ్చరించాలి. ఇలా చేస్తే శనిదోషాలు పారిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.