శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 31 జనవరి 2020 (22:30 IST)

దృష్టి దోషం... ఈ శ్లోకంతో పటాపంచలు...

దృష్టి దోషాలు అనేవి వుంటాయన్నది మన పెద్దలు చెప్పే మాట. ఇలాంటి దోషాలు తగులకుండా ఉండాలంటే శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకం పఠిస్తే చాలు. విబూతిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల నుదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాయాలి. దీనివల్ల దృష్టి దోషాలు తొలగి, సర్వ గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభిస్తుంది. 
 
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
 
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II
 
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని ఈ శ్లోకం పఠిస్తే చాలును.