శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2020 (19:11 IST)

అరటిపండును శీతాకాలంలో రాత్రిపూట తీసుకుంటే..?

అరటిపండును శీతాకాలంలో మాత్రం తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. చలికాలంలో రాత్రిపూట అరటిపండ్లు తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలు ఇది వరకు ఉన్నట్లైతే వారికి మరింత ఇబ్బంది తప్పదు. 
 
అరటి పండ్లలో పుష్కలమైన విటమిన్స్, మినరల్స్ వుంటాయి. ఇందులోని క్యాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. అలాంటి అరటి పండ్లను శీతాకాలంలో రాత్రిపూట తీసుకుంటే అజీర్తి సమస్యలు తప్పవు. శ్వాస సమస్యలు తప్పవు. ఇంకా బద్ధకం పెరుగుతుంది. అర్థరాత్రి పూట అరటి పండ్లు చేయకూడదు. స్వీట్లు, పండ్లను శీతాకాలంలో రాత్రి పూట అస్సలు ముట్టుకోకూడదు. 
 
ఇందులోని హైకేలోరీలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా జలుబుతో దగ్గుతో బాధపడేవారు మాత్రం శీతాకాలంలో రాత్రి పూట అరటిపండును తీసుకోకపోవడం మంచిది.  శీతాకాలంలో దగ్గు జలుబు లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు అరటి పండును తీసుకుంటే శ్లేష్మం లేదా కఫంతో చికాకు కలిగిస్తుంది.
 
అరటిని రాత్రి పూట శీతాకాలంలో కాకుండా మిగిలిన సీజన్‌లలో తీసుకుంటే హృద్రోగ సమస్యలు వుండవు. బ్లడ్ ఫ్రెషర్ తగ్గుతుంది. ఒబిసిటీతో బాధపడే వారు మాత్రం అరటిపండ్లు అధికంగా తీసుకోకపోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.