శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 6 జనవరి 2020 (17:05 IST)

శీతాకాలంలో అందం కోసం, టమోటా రసానికి నిమ్మరసం చేర్చి...

చలి కాలంలో చాలామందికి చర్మం పగలడం, పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు టమోటా జ్యూస్ సౌందర్య సాధనంగా పనికి వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. శీతాకాలంలో చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి టమోటో ఉత్తమమైంది.
 
టమోటోలోని నేచురల్ ఆస్ట్రిజెంట్, చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. టమోటో జ్యూస్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది మొటిమలను మరియు డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తుంది.
 
టమోటో జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం చేర్చి, అందులో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం పైన అప్లై చేస్తే స్కిన్ మెరిసిపోతుంది.
 
ఇక జిడ్డు చర్మ స్వభావం కలిగినవారు టమోటో జ్యూస్‌తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్‌కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత ఓ ఇరవై నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.