శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (18:38 IST)

శీతాకాలంలో పసుపును ఇలా వాడితే.. నెలసరి సమయంలో? (video)

శీతాకాలంలో పసుపును ఆహారంలోతప్పక చేర్చుకోవాలి. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదో అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. పసుపును కూరలు, కాఫీ, స్మూతీలతో కలిపి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
పసుపును, నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయట. ఎందుకంటే పసుపుతో కలిసిన మిరియాల పొడి, అధిక వేడిని శరీరం పీల్చేసే కారకంలా పని చేస్తుంది.
 
పసుపు కలిపిన పాలు తాగటం వలన ఆడవాళ్ళలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి, చిరాకు వంటివి దరి చేరకుండా ఉంటాయి.
 
పసుపులో ఉండే యాంటి ఫంగల్, యాంటి వైరల్ గుణాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి. తద్వారా మన శరీరం తోందరగా ఇన్‌ఫెక్షన్ల భారీన పడకుండా కాపాడుతాయి. 
 
డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెరను తగ్గిస్తుంది. దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.