గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (12:21 IST)

శీతాకాలంలో టమోటాలు తప్పక తీసుకోవాలట.. పురుషుల్లో ఆ సమస్య?

శీతాకాలంలో టమోటాలతో సలాడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. టమోటాలు ఆరోగ్యాన్ని, అందాన్ని, పెంచటానికి ఉపయోగపడుతాయి. కేన్సర్ కణితలు పెరుగుదలను నివారించడానికి టమోటాలు ఉపయోగపడతాయి. దీనిలో ఉండే లైకోసిస్ అనే సహజ రసాయన పదార్థం కేన్సర్ కణితల పెరుగుదలను నివారిస్తుంది. గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. 
 
ఇంకా టమోటాల్లోని లైకోపిన్ పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. టమోటాలను తీసుకోవడం ద్వారా  బరువు సమస్య వుండదు. విటమిన్ ఇ, జింక్, లైకోపిన్‌లు శరీరానికి యాంటీ యాక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా టమోటాల్లోని లైకోపిన్ పురుషుల్లో శుక్రకణాల సంఖ్యను పెంచుతాయి. పురుషుల్లో వీటి సంఖ్య సరిగ్గా వుంటేనే సంతానం కలుగుతుంది. శుక్ర కణాలు ఏమాత్రం యాక్టివ్‌గా లేకపోయినా సంతానం కలుగదు. అందుకే పురుషులు రోజూ టమోటాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
రోజూ టమోటాలను జ్యూస్‌గా కానీ, సూప్‌గా కానీ తీసుకుంటే లివర్ వ్యాధులను తగ్గిస్తుంది. ఆ జ్యూస్‌కి కొంచెం అల్లం రసం కలిపి తీసుకుంటే చాలా మంచిది. టమోటా జ్యూస్‌ను ముఖంపై రాసుకొని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖంపైనున్నా మచ్చలు పోయి కాంతివంతంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.