బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (13:03 IST)

ఆవాలే కదా అని తీసిపారేయకండి.. కొవ్వును కరిగించేస్తాయట..!

ఆవాలే కదా అని తీసిపారేయకండి.. పోపుకు ఉపయోగించే ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శీతాకాలంలో గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే మేలు చేస్తుంది. ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది. ఆవాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. 
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. ఆవాల పేస్టును, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
 
చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవపొడి తొలగిస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది. పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.