శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:46 IST)

రెండు ద్వారాలు అలా వుంటే కళత్రపీడ...

ఏ దిశలో సింహద్వారం వుంచాలన్నది తెలియక చాలామంది తికమకపడుతుంటారు. ఒకే సింహద్వారం పెట్టదలచుకుంటే తూర్పు దిశ, రెండు ద్వారాలైతే తూర్పు, పడమర, ఉత్తరం దిశలు అనుకూలం. నాలుగు వైపుల ద్వారాలు ఉండటం శ్రేష్ఠం. 
 
ఏకద్వారం : తూర్పున ధనవృద్ధి. దక్షిణ దిశ జయం, పడమట ధనహాని, ఉత్తర దిశ ధన నష్టం. 
 
రెండు ద్వారాలు : తూర్పు- దక్షిణ దిశలు కళత్రపీడ, తూర్పు-పడమర పుత్రవృద్ధి, దక్షిణ- పడమరలు ద్రవ్యలాభం, తూర్పు - ఉత్తర దిశలు కష్టానష్టాలు, ఉత్తర - దక్షిణాలు శత్రుభయం, ఉత్తర - పశ్చిమాలు కీడు. 
 
మూడు ద్వారాలు : తూర్పు, పడమర, దక్షిణ దిశలు సౌఖ్యలోపం. తూర్పు, ఉత్తర, దక్షిణాలు సంపద, తూర్పు, ఉత్తర, పశ్చిమాలు అనారోగ్యం. ఉత్తర, దక్షిణ, పశ్చిమాలు కీర్తిసంపదలు. 
 
నాలుగు దిశల ద్వారాలు : సౌఖ్యం, లాభదాయకం. నాలుగు దిశలా ద్వారాలు ఉండడం అన్నివిధాలా శ్రేయస్కరం. ద్వారాలు సరిసంఖ్యలో వుండాలి.
 
ఇదేవిధంగా కిటికీలు, దూలాలు, అలమర్లు సరిసంఖ్యలో వుండాలి. ద్వారాలు, కిటికీలు, అలమరలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటికీలు వుండాలి. దక్షిణ పశ్చిమ దిశలలో కిటికీలు విధిగా వుండాలి.