శుక్రవారం, 18 జులై 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జులై 2025 (12:46 IST)

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

Lord Bhairva
Lord Bhairva
కాలాష్టమి రోజు కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించడం ఆనవాయితీ. ఈ రోజు నల్ల కుక్కకు పొట్టు మినప్పప్పుతో చేసిన గారెలు, పెరుగు అన్నం ఆహారంగా ఇస్తారు. అనంతరం కాలాష్టమి వ్రత కథను చదువుకోవాలి. కాలాష్టమి రోజు కాల భైరవుడిని ఆరాధించడం వలన నవ గ్రహాల ప్రతికూల ప్రభావాలు, రాహు కేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. 
 
కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాల భైరవుడిని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
అలాగే భక్తిశ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. అంతేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. 
 
అలాగే కాలభైరవుని సమక్షంలో కాలాష్టమి రోజున సాయంత్రం ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణలు చేయాలి. కాల భైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.