సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (16:20 IST)

నా బిడ్డకు విద్యా పునాది వేసిన టీచర్లకు కృతజ్ఞతలు : అల్లు అర్జున్

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ప్రీస్కూల్ పూర్తి చేసుకున్నాడు. దీనిపై అల్లు అర్జున్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. 'అయాన్ నువ్వు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. నా కొడుకు మంచి విద్యావంతుడు అయ్యేందుకు అవసరమైన పునాది వేయడంలో సహకరించిన బోధి వ్యాలీ స్కూల్ ఉపాధ్యాయవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
 
మా బిడ్డ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోసం బోధి వ్యాలీ స్కూల్ ను ఎంచుకున్నందుకు ఇప్పుడు తల్లిదండ్రులుగా మేమెంతో సంతోషిస్తున్నాం. ఇన్నేళ్లకాలంలో నా బ్డిడను సరైన రీతిలో నిలిపిన టీచర్లకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ్టి ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను చిరస్మరణీయ జ్ఞాపకంగా భావిస్తాం' అంటూ భావోద్వేగ ట్వీట్ చేశాడు.