శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2020 (20:32 IST)

ఆ హీరోయిన్ బ్రేకప్‌కి బ్రేకులు పడ్డట్టే.. ఎవరు?

బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. అయితే అవన్నీ తప్పని నిరూపించిన సంఘటన ఇటీవల జరిగింది. 
 
వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో చేతిలో చెయ్యివేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీజనాలు. వీరి ప్రేమ ముసుపటిలాగే గాఢంగా ఉందట. కాకపోతే కెరీర్ పరంగా అది అడ్డుగా మారే అవకాశముండటంతో కొంతకాలం విడిగా ఉండాలని మాత్రం నిర్ణయించుకున్నారట.
 
కానీ ఎక్కువకాలం దూరంగా ఉండలేకపోయారట. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారట. ప్రేమ గాఢంగానే ఉంది. ఇక వీరిద్దరు పెళ్ళి చేసుకోవడమే తరువాత అంటున్నారు సినీవర్గాలు.