టైగర్ ష్రాఫ్ కంటే ఫర్హార్ అక్తర్‌తో తిరగడమే ఇష్టం : దిశా పటానీ
బాలీవుడ్ సుందరాంగుల్లో దిశా పటానీ ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరో ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో నటించింది. అయితే, ఈ నటి నటన కంటే.. ముదురు నటుడు టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌లు, షికార్లు చేస్తూనే మంచి గుర్తింపు పొందింది. అంటే ష్రాఫ్‌తో కొంతకాలం ప్రేమాయణం నడిపింది.
పైగా, అతనితో డేటింగ్ కూడా చేసింది. పైగా, ప్రపంచంలోని అందమైన ప్రాంతాల్లో షికార్లు చేసింది. తమ విదేశీ టూర్లకు జంటగా వెళ్లడం, అక్కడి ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడం వంటివి చేసేవారు. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ వీరి స్నేహం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. అదేసమయంలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు, గాయకుడు ఫర్హాన్ అక్తర్‌తో శ్రద్ధ కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి టైగర్‌కు దగ్గరైనట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై శ్రద్ధ స్పందించింది. 'అవును.. టైగర్ ష్రాఫ్ అంటే నాకు చాలా ఇష్టం. అతను నాకు ప్రియమైన వ్యక్తి' అని చెప్పింది. మొత్తంమీద దిశా పటానీ - ఫర్హాన్ అక్తర్ ప్రేమాయణం వార్తలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.