ప్రభుదేవా స్పీడ్‌ను తట్టుకోలేక మోకాళ్లు పగులగొట్టుకున్న హీరోయిన్
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. ఈయన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తెగ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రభుదేవా కంపోజ్ చేసే స్టెప్పులు వేయలేక ఓ హీరోయిన్ మోకాళ్లు పగులగొట్టుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు దిశా పఠానీ.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "భారత్" సినిమా తర్వాత దిశా పఠానీ రేంజ్ మారింది. ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంది. రీసెంట్గా ఈ అమ్మడు మోహిత్ సూరీ తెరకెక్కించిన 'మలంగ్' చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్, అనీల్ కపూర్, కునాల్ కెమ్ము ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం ప్రభుదేవా - సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న "రాధే" చిత్రంలో కూడా దిశా పఠానీ నటిస్తోంది. అయితే రెండో షెడ్యూల్ ప్రారంభానికి ముందు దిశా పటానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో తన మోకాళ్ళని గాయపర్చుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయపడిన మోకాళ్ళని చూపిస్తూ.. ప్రభుదేవ పాట షూటింగ్ అంటే ఇలానే ఉంటుంది అని కామెంట్ పెట్టింది.