సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:08 IST)

ప్రభుదేవాకూ దెయ్యం పడితే...?

తమన్నాకు దెయ్యం పడితే ప్రభుదేవా ఎన్ని తిప్పలు పడ్డారో ‘అభినేత్రి’లో ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు... తమన్నాతో పాటు ప్రభుదేవాకూ దెయ్యం పడితే... ఎలా ఉంటుందో సీక్వెల్‌ ‘అభినేత్రి 2’లో చూడమంటున్నారు నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. 
 
వివరాలలోకి వెళ్తే... విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘తమిళంలో ‘దేవి’గా, తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైన హారర్‌ కామెడీ సినిమా మంచి విజయం సాధించింది. 
 
దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.