బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (15:41 IST)

పార్టీకి వెళ్తున్నారా.. మరి మేకప్ ఎలా వేసుకోవాలి..?

పార్టీకి వెళ్తున్నారా.. మేకప్ వేసుకునేందుకు ఎక్కువ సమయం లేదా.. అయితే అలాంటి సమయాల్లోను మేకప్ వేసుకునే వెసులుబాటు ఉంది. కేవలం రెండు నిమిషాల్లోపే మేకప్‌ వేసుకోవడం పూర్తిచేసి పార్టీకి దర్జాగా వెళ్లొచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా... ఈ కథనం చదవండి మరి.. 
 
ముఖంపై మచ్చలు లేదా గుంతలు వంటివి కనపడకుండా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కాంపాక్ట్‌ను వేసుకుంటే చర్మం మెరుస్తుంది. కనురెప్పలపై బ్రష్‌ను ఉపయోగించి ఐ షాడో వేసుకోవాలి. నల్లని ఐ లైనర్‌ను కంటి కొసలకు ఇరువైపులా వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదంతా కేవలం అరవై సెకన్‌లలోపు మాటే.
 
మరో అరవై నిమిషాల్లోగా.. చేతి వేళ్ల సహాయంతో గులాబి రంగు క్రీమును బుగ్గలపై అద్దితే, బుగ్గలు కాంతివంతంగా మెరుస్తాయి. అయితే దీనికి ముదురు రంగులు కాకుండా తేలిక పాటి రంగులను ఎంచుకుంటే మంచిది. 
 
మేకప్‌లో ముఖ్యాంశం పెదవులు.. ముందుగా లేత గులాబి రంగు లిప్ లైనర్ ఉపయోగించాలి. తర్వాత మీకు ఇష్టమైన రంగు లిప్‌స్టిక్‌ను లిప్‌బ్రష్‌ను ఉపయోగించడం కంటే చేతి వేళ్లు ఉపయోగిస్తే మరీ మంచిది. అంతే 2 నిమిషాల్లోనే మేకప్ ఓవర్ ఇంకేంటి? నచ్చిన డ్రెస్‌తో పార్టీకి వెళ్లిపోవచ్చు.