ఆడవాళ్ళ ఒక్క చూపుతో మగాడు ఎలాంటివాడో కనిపెట్టేస్తారట... మరి మగవాళ్లూ?

Beauty
జె| Last Modified శనివారం, 23 మార్చి 2019 (14:40 IST)
టీనేజ్‌లో అబ్బాయిలకు కంటి మీద కునుకు లేకుండా ఉందంటే అందుకు కారణం అమ్మాయిలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మగవాళ్ళ చూపును బట్టి వాళ్ళు తమ నుంచి ఏం ఆశిస్తున్నారో తమతో ఎటువంటి సంబంధం కోరుకుంటున్నారో మగువలు ఇట్టే పసిగట్టేస్తారట. ఈ ఆసక్తికర అంశంపై పరిశోధకులు కొంతమంది యువకులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చారట.

పరిశోధనల్లో పాల్గొన్నవారు చెప్పిన మాటలు దాదాపు దగ్గరగా ఉన్నాయట. పరిశోధకులు ముందుగా అమ్మాయిల ఫోటోలను అబ్బాయిలకు చూపించారు. ఆ అమ్మాయిల ఫోటోలపై కవర్ ఫోటోలను అంటించారు. అయితే అన్ని శరీర భాగాలనేవి కనిపించడం లేదు. ఒక పార్ట్ మాకు కనిపించేలా పెట్టండి అంటూ యువకులు అడిగారట. ఆడవాళ్ళ ఆకర్షణీయమైన శరీర భాగాలను ఇష్టపడడం కనిపించిందట.

ఆ తరువాత వారితో రిలేషన్‌షిప్ కొనసాగించడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదట. అబ్బాయిలు చాలావరకు అమ్మాయి అందంగా ఉంటే చాలు అనుకుంటారు. కొంతమంది అబ్బాయిలు మాత్రం ఫ్యామిలీ జీవితం కొనసాగించడానికి మక్కువ చూపుతారు. అమ్మాయిల శరీరాకృతి బాగుంటే చాలామంది వారిపై మక్కువ చూపుతారట.

సైకాలజిస్టులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిని ఒక అబ్బాయి కలిసినప్పుడు ఆమె శరీరం గురించి వర్ణించడానికి ప్రాధాన్యమిస్తాడట. ఇలాంటి అబ్బాయిలు అప్పటి సుఖం కోసమే అలా ఉంటారని అయితే పొరపాటున వారికి అటాచ్ అయినా ఎక్కువ రోజులు కలిసి ఉండరని పేర్కొన్నారు. అంటే మోజు తీరిపోయి ముఖం మొత్తిన తరువాత హ్యాండిచ్చేస్తారట. అయితే పరిశోధకులు కనిపెట్టిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటివి అమ్మాయిలు అబ్బాయిల కళ్ళలోకి చూసి పసిగట్టేస్తారట.దీనిపై మరింత చదవండి :