శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (18:41 IST)

మరోసారి రొమాంటిక్‌గా బుల్లితెరపై విరుష్క జంట... ప్యూర్ లవ్

అతనేమో ఎంతో క్రేజ్ ఉన్న క్రికెటర్, ఇక ఆమె బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్. దాదాపుగా ఐదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కలిసి ఓ షాంపూ అడ్వర్టైజ్‌మెంట్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.


ఆ తర్వాత కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీళ్లిద్దరూ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ప్రేమించి, పెళ్లి చేసుకుని క్యూట్ కపుల్‌గా అదేనండీ విరుష్కగా మారిపోయారు. తాజాగా విరుష్క జోడీ ఒక యాడ్ ఫిల్మ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా కనిపించారు. దీనికి సంబంధించి విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
ఆ యాడ్‌లో...అనుష్క బిజీగా పనిచేసుకుంటుంటే విరాట్ కోహ్లీ కాఫీ తీసుకుని ఇస్తాడు. ఆ కాఫీ తీసుకుని అనుష్క శర్మ తాగబోతుండగా.. ఆగు.. వేడిగా ఉందంటూ విరాట్ కోహ్లీ ప్రేమతో కాఫీని చల్లార్చి ఇస్తాడు. ఆ ప్రేమకి పొంగిపోయిన అనుష్క శర్మ.. ప్రేమగా కోహ్లీ ముక్కు పట్టుకుని ముద్దాడుతుంది. అప్పుడు అందరూ ‘మీ ప్రేమలో ఏంటి స్పెషల్?’ అని అడుగుతుండగా.. మధ్యలో అనుష్క శర్మ వచ్చి.. ‘ఏమీ లేదు’ ‘జస్ట్ ప్యూర్ లవ్’ అంటూ నవ్వేస్తుంది.