శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (21:39 IST)

అనుకున్నదే జరిగింది... ధోనీ లేడు... మ్యాచ్ ఓడారు...(Video)

అందరూ అనుకున్నట్లే ధోనీ జట్టులో ఆడకపోతే ఆ మ్యాచ్ పోతుందన్న నమ్మకం మరోసారి నిజమైంది. ఢిల్లీలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన ఐదో వన్డేలో ఇండియా 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీనితో సిరీస్ 3-2 తేడాతో ఆసీస్ వశమైంది. ఇకపోతే ధోనీ జట్టులో వుండి ఆడకపోతే ఆ మ్యాచ్ మటాష్ అంటూ గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తూనే వున్నాయి. అనుకున్నట్లుగా మ్యాచ్ ఓడింది టీమిండియా.
 
273 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఆదిలోనే తడబాటు పడింది. శిఖర్ ధావన్ ఎప్పటిలానే అత్యల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు. కేవలం 12 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి కూడా కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు. పంత్ 16 పరుగులు, శంకర్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్ శర్మ కూడా 89 బంతుల్లో 56 పరుగులు చేసి పెవిలియన్ ముఖం పట్టాడు. 
 
జడేజా అయితే డకౌట్ అయ్యాడు. జాధవ్-కుమార్ ఇద్దరూ ధాటిగా ఆడటంతో గెలుస్తారనే ఆశలు చిగురించాయి. కానీ వెంటవెంటనే ఇద్దరూ తమ వికెట్లు పారేసుకుని వెళ్లిపోయారు. జాదవ్ 44 పరుగులు, కుమార్ 46 పరుగుల వద్ద నిష్క్రమించారు. ఇక ఆ తర్వాత వచ్చిన సామి 3 పరుగులు, యాదవ్ 9 పరుగులు చేసినా అప్పటికే భారత్ అపజయం ఖరారైపోయింది. దీనితో 50 ఓవర్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. వీడియో చూడండి...