ఐదో వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చక్కగా కుక్కతో ఎంజాయ్... ధోనీ ఆడడా?

Kohli
Last Modified సోమవారం, 11 మార్చి 2019 (20:46 IST)
గెలవాల్సిన మ్యాచ్‌ని చెత్త ఫీల్డింగుతో చేజేతులా చేజార్చుకుని క్రికెట్ అభిమానులను ఉస్సూరుమనిపించిన టీమిండియా కుర్రాళ్లు ఐదవ వన్డే ఆడేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆదివార నాడు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ హైదరాబాద్, నాగ్‌పూర్‌లో గెలిచింది భారత జట్టు. దీనితో ఇరు జట్లు 2-2తో వున్నాయి. ఈ నేపధ్యంలో ఐదో వన్డేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే.

ఐదో వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలావుంటే ఢిల్లీ చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నేరుగా ఇంటికి వెళ్లి పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఆ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూసినవారు కొందరు వావ్ అని కామెంట్లు పెడుతుంటే మరికొందరు... ఐదే వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చూడండి... చక్కగా కుక్కతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మనం కూడా ఇలాగే వుండాలి. ఒత్తిడి, టెన్షన్ పడకూడదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇకపోతే నాలుగో వన్డేలో వికెట్ కీపర్ గా వ్యవహరించిన పంత్... ఐదో వన్డేలో కూడా ఆడుతాడని అంటున్నారు. ఈ లెక్కన ధోనీ రిజర్వ్ బెంచిలోనే వుండి ఆట చూడాలన్నమాట. అదీ సంగతి.దీనిపై మరింత చదవండి :