ఈ శిఖర్ ధావన్ వున్నాడు చూశారూ... పీకేయడం ఖాయమేనా?

shikhar dhawan
Last Modified బుధవారం, 13 మార్చి 2019 (18:24 IST)
కీలకమైన ఐదో వన్డే మ్యాచ్‌లోనూ శఖర్ ధావన్ మరోసారి తన పేలవమైన ఆట తీరును బలవంతంగా క్రికెట్ క్రీడాభిమానులకు రుచి చూపించాడు. గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవైపు ఆసీస్ జట్టు 273 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ నేపధ్యంలో ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన శిఖర్ వచ్చీ రావడంతోనే కేవలం 15 బంతులు ఆడి 12 పరుగులు చేసి తన వికెట్ సమర్పించుకుని వెళ్లాడు. ఇప్పటికే శిఖర్ ఆటతీరుపై విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. మరి వచ్చే ప్రపంచ కప్ నాటికి శిఖర్ ధావన్ ను జట్టులో వుంచుతారో లేదంటే పీకిపారేస్తారో... చూడాల్సిందే.దీనిపై మరింత చదవండి :