గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (17:23 IST)

పుచ్చకాయ తినేటప్పుడు గింజలను పడేస్తున్నారా?

వేసవి కాలం రానే వచ్చింది. అసలే వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. శరీరంలోని నీరు చెమట రూపంలో ఆవిరైపోతూ, గొంతు త్వరగా ఎండిపోతుంది. ఈ సమయంలో శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్నిచ్చే ఆహార ప‌దార్థాల కోసం అందరూ వెతుకుతుంటారు. ఎండాకాలంలో పుచ్చకాయలను విరివిగా తింటుంటారు. పుచ్చకాయల వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. 
 
అయితే మనలో చాలా మంది పుచ్చకాయలను తిని వాటి గింజలను మాత్రం బయటకు ఊసేస్తుంటారు. అలా విత్తనాలను బయటకు ఉమ్మకండి అని శాస్త్రవేత్తలు అంటున్నారు. పుచ్చ విత్తనాలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
 
పుచ్చకాయ విత్తనాలను తినడం వల్ల ఈ ఐదు ముఖ్యమైన లాభాలు కలుగుతాయి. అవి ఏమిటో ఓ సారి చూద్దాం.. 
 
* హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది.
* పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి. అలాగే ఏదైనా పని చేసేటప్పుడు అలసట చాలా వరకు తగ్గుతుంది.
 
* మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే వీటని రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
* డ‌యాబెటిస్ (షుగర్) ఉన్న‌ వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
* రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
 
* కంటి చూపును మెరుగుప‌రిచే అద్భుత‌మైన ఔషధ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉంటాయట. కాబట్టి పుచ్చకాయ విత్తనాలను నిత్యం తింటున్నట్లయితే నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.