శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (11:33 IST)

వేసవిలో దోసకాయ రసం తాగితే..?

వేసవిలో కీరదోసను తీసుకోవడం ద్వారా చర్మంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో ఒంట్లోని మలినాలు, విషపదార్థాలు బయటకు పోతాయి.కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరిగిపోతాయి. కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. 
 
కీర ముక్కల్ని సలాడ్స్‌ లేదా సూప్‌ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి నీటితో పాటు పీచుపదార్థం కూడా అధికంగా అందుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్, హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి. 
 
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. దోసకాయలో ఉన్న పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.