శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (13:33 IST)

వాము ఆకుల డికాషన్ తాగితే..?

భారతీయులు వాడే రకరకాల వంటింటి పదార్థాలలో వాము గింజలు ఒకటి. ఈ గింజలను పలురకాల పానీయాలు తయారీకోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే వామును వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు అంతే మేలు చేస్తాయి. మరి వామును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
కొన్ని వాము ఆకులను శుభ్రంగా కడుక్కుని ఓ పాత్రలో నీరు తీసుకుని అందులో ఈ ఆకులను వేసి బాగా మరిగించి డికాషన్ తయారుచేసుకోవాలి. అందులో కొద్దిగా తేనే కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా తరచు తాగితే వేసవి కారణంగా వచ్చే.. తలనొప్పి, జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
వాము ఆకుతో తయారుచేసిన డికాషన్‌ను తరచు తాగుతుంటే అజీర్తి సమస్య రాదు. ముఖ్యంగా జీర్ణక్రియలు సక్రమంగా జరుగుతాయి. అలానే డయాబెటిస్ ఉన్నవారు వాము డికాషన్‌ను రోజూ క్రమంగా తాగితే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
వాము ఆకుల డికాషన్ తాగడం వలన శరీర ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దాంతో మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.