సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (16:41 IST)

చక్కెర వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తినొచ్చు...

దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అదేసమయంలో ఈ వ్యాధిబారినపడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాగే, పండ్లు ఆరగించాలన్నా భయపడుతుంటారు. 
 
డ‌యాబెటిస్ ఉన్న చాలా మంది పండ్లు ఎలాగూ తియ్య‌గానే ఉంటాయి క‌నుక వాటిని తిన‌డం మానేస్తారు. కానీ నిజానికి అన్ని పండ్ల‌ను దూరం పెట్ట‌డం మంచిది కాదు. ఎంత డ‌యాబెటిస్ ఉన్నా స‌రే.. కొన్ని పండ్ల‌ను మాత్రం మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు తిన‌వ‌చ్చు. అవేమిటంటే... 
 
మధుమేహంతో బాధపడుతున్నవారు ద్రాక్ష, యాపిల్‌, దానిమ్మ, జామపండ్లు, నారింజ‌, నేరేడు పండ్లు, అంజీర్‌, పైనాపిల్ పండ్లను నిర్భయంగా ఆరగించవచ్చు. ఈ పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువగానే ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తిన్న వెంట‌నే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు. అందువల్ల మధుమేహ రోగగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా ఆరగింవచ్చని తెలిపారు.