శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 మార్చి 2019 (18:21 IST)

ఎండాకాలంలో మజ్జిగ తాగాలంటారు... ఎందుకో తెలుసా?

ఎండకాలం వచ్చేసింది. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. వీరి ఆరోగ్యం కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. వీరికి ఎక్కువగా ద్రవపదార్ధాలను అందేవిధంగా చూడాలి. అవి ఏంటంటే కొబ్బరినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ రసం, రాగిజావ, సగ్గుబియ్యం జావ. మనం ఇప్పుడు మజ్జిగ గురించి తెలుసుకుందాం.
 
1. పిల్లలు ఎక్కువ సమయం చదవటం వలన వారికి పైత్యం ఏర్పడుతుంది. దీనిని తగ్గించడానికి మజ్జిగలో పటికబెల్లం కలిపి ఇవ్వాలి.
 
2. నిద్ర సరిగా పట్టనివారు మజ్జిగలో పెద్దఉల్లిపాయను పేస్టులా చేసి కలిపి నిద్రపోయే గంటముందు తీసుకోవాలి.
 
3. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
 
4. మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పిల్లలకు నీరసం రాకుండా ఉంటుంది.
 
5. రక్తం తక్కువగా ఉన్న పిల్లలకు పండ్ల రసాలతో పాటు, కర్వేపాకు కలిపిన మజ్జిగను ఇవ్వడం వలన రక్త వృద్ధి చెందుతుంది.
 
6. మజ్జిగను పలచగా వెన్న తీసి ఎక్కువసార్లు ఇవ్వాలి.
 
7. ఎండ వలన చర్మం పొడిబారిపోతే మజ్జిగలో నిమ్మరసం కలిపి రాసుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.