గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 మార్చి 2019 (20:32 IST)

పాలకూరతో ఆ శక్తి రెట్టింపు....

ఆకుకూరల్లో పోషక విలువల గురించి చెప్పనక్కర్లేదు. వారంలో ఏదో ఒకరోజు ఆకుకూర తినడం నేర్చుకోవాలి. ఆకుకూరలను వండుకుని తింటే ఆరోగ్యమని వైద్యులు చెపుతున్నా చాలామంది పట్టించుకోరు. ఐతే అన్నింటికంటే పాలకూరలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. వారంలో రెండుసార్లు పాలకూరను తింటే ఎంతో లాభమట. 
 
ప్రతి ఒక్కరు పాలకూర తినాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ ఇ కాకుండా సి, ఖనిజ లవణాలు, కాల్షియం లభిస్తాయి. రక్తహీనతకు చెక్ పెడుతుందట. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందట. దాంతోపాటు అధిక రక్తపోటును తగ్గిస్తుందట. పాలకూర తీసుకుంటుంటే జుట్టు అందంగా పెరుగుతుందట. మతిమరుపు దూరమవుతుందట. ఎముకలను బలంగా ఉంచుతుంది. 
 
గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది. శారీరక పెరుగుదలకు బాగా పెరుగుతుంది. అలాగే శృంగార సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుందట.