గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 మార్చి 2019 (22:02 IST)

ఉప్పుతో అందం- ఆరోగ్యం

ఉప్పు అనగానే వంటలలో రుచికి వాడే పదార్దమన్న విషయం మనందరికి తెలిసిందే... కానీ ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పని చేస్తుంది. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఉప్పు అందానికి కూడా వన్నె తెస్తుందంట. ఆ చిట్కాలేమిటో చూద్దాం. 
 
1. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా కనిపిస్తుంది. 
 
2. కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. 
 
3. చర్మం తడిగా ఉన్నప్పుడు శరీరంపై ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. 
 
4. ఉప్పు, లవంగ నూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.
 
5. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి. అలాగే మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.