శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 మార్చి 2019 (22:13 IST)

మహిళలకు మీగడతో అందం... ఎలాగో తెలుసా?

పూర్వకాలంలో చాలామంది మహిళలు మీగడ లేదా వెన్ననే ముఖానికి రాసుకునేవారు. అప్పట్లో మాయిశ్చరైజర్లు లాంటివి ఉండేవి కావు. ప్రస్తుతకాలంలో  రసాయనాలతో నిండిన మాయిశ్చరైజర్లు, క్రీములు చర్మంపై  వాడడం వలన అవి సున్నితమైన చర్మంపై చెడు ప్రభావం చూపుతున్నాయి. అయితే, మీగడ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకపోగా ఎన్నో ఉపయోగాలున్నాయి. మీగడ మంచి మాయిశ్చరైజర్ గానే కాదు, చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అవేంటో తెలుసుకుందాం.
 
1. బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు కలిపి పేస్ట్‌లా తయారయ్యాక ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అంతేకాకుండా చర్మం పొడిబారకుండా ఉంటుంది.
 
2. కొత్తిమీర, పుదీనా ఆకులను సమానంగా తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టిస్తే.. జిడ్డు తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.
 
3. బాదం, ఓట్స్ సరిపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు.
 
4. పాల మీగడ లేదా పెరుగుతో తేనె కలిపి కంటికి మర్దన చేసుకుంటే.. కంటి కిందటి వలయాలకు చెక్ పెడతాయి. జుట్టు నెరసిన వారు అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ తీసుకుంటూ వుండాలి. బాదం ఆయిల్ ఉపయోగించడం మంచిది. డ్రై హెయిర్ కలిగిన వారు హెన్నాతో పాటు ఆమ్లా, మందార ఆకుల్నికలిపిన హెన్నా రాసుకోవడం ఉత్తమం.
 
5. మీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. మీగడకు కాస్త నిమ్మరసం కలిపి నల్లమచ్చలు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా మీగడలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.