శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (14:20 IST)

కన్నకుమారులపై తల్లి ఇటుకలతో దాడి.. ఇద్దరూ ఏమయ్యారంటే?

కన్నతల్లే కిరాతకురాలిగా మారిపోయింది. పిల్లలపై ఇటుకతో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడేందుకు కుటుంబ కలహాలో లేక మానసిక సమస్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వుంటోంది. ఇంతలో ఏమైందో కానీ ఇద్దరు కుమారులపై ఇటుకతో దాడి చేసింది. ఈ ఘటనలో అజయ్ (11) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. చిన్నకుమారుడు (8) తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిద్దరిపై దాడి చేసి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించింది.