శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (15:00 IST)

కలబంద, ఆముదాన్ని జుట్టుకు పట్టిస్తే..?

స్త్రీలు సాధారణంగా ఒత్తయిన జుట్టుకోసం నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారికి కలబంద ఎంతగానో పనిచేస్తుంది. ఒత్తయిన జుట్టుకు, జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. సాధారణంగా జుట్టు మొదళ్ల నుండి అమినో ఆమ్లాలు వెలువడుతుంటాయి. ఇదే ఆమ్లం కలబందలో పుష్కలంగా ఉంటాయి. 
 
ఈ కలబంద మిశ్రమాన్ని జుట్టుకు క్రమంతప్పకుండా పట్టించడం వలన జుట్టు పెరగడంతో పాటు పొడిబారడం తగ్గుతుంది. చుండ్రును కూడా అరికడుతుంది. మరి కలబందను ఎలా వాడాలో ఓసారి తెలుసుకుందాం..
 
తాజాగా తీసిన అరకప్పు కలబంద గుజ్జులో కొద్దిగా ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతివారం చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
తలస్నానం చేసే 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును జుట్టుకు రాసుకోవాలి. ఈ గుజ్జులోని ఎంజైమ్‌లు తలలోని మృతుకణాలను తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తుంది. అంతేకాక తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
 
పావుకప్పు కలబంద గుజ్జులో 2 స్పూన్ల్ ఆలివ్ నూనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టంతా పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.