ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:25 IST)

కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ చేసి....?

ముఖచర్మంపై మొటిమలు రావడానికి రోజూ తీసుకునే డైట్ కూడా కారణమంటున్నారు. కాలుష్యం నుండి చర్మాన్ని రక్షించుకున్నట్టే, ప్రతిరోజూ సరైన ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా మొటిమలు ముఖంపై ఏర్పడే మచ్చలను దూరం చేసుకోవచ్చును. కొందరైతే అదేపనిగా కాఫీలు తాగుతుంటారు.. దీని వలన కూడా ముఖంపై మొటిమలు వస్తాయని చెప్తున్నారు. ఈ మొటిమ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే ముఖంపై మొటిమలు పోయి చర్మం తాజాగా, మృదువుగా తయారవుతుంది. 
 
2 స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే కూడా మొటిమలు పోతాయి. అలానే కలబంద గుజ్జును పాదాలకు రాసుకుని కాసేపటి తరువాత శుభ్రం చేస్తే పాదాలు మురికిపోయి మృదువుగా మారుతాయి.
 
అతిగా ప్రాసెస్ చేసిన పదార్థఆలు తినడం వలన కూడా అవి ఇన్సులిన్‌పై దాడి చేస్తాయి. అందుకే బేక్, ఫ్రై చేసిన జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు. లేదంటే మొటిమలు వచ్చేస్తాయి. వీటికి బదులు పండ్లు, కూరగాయలు తింటే మంచిది. ఒత్తిడి వలన కూడా మొటిమలు వస్తుంటాయి. దీని కారణంగా శరీరంలో హార్మోనల్ తేడావొస్తుంది. అందువలన బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ.. సరైన నిద్ర ఉంటే మొటిమలు దరిచేరవు.