గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:01 IST)

3 కప్పుల నీటిలో మెంతులు వేసి...?

వంటిల్లంటే మెంతులు తప్పకుండా ఉంటాయి. ఈ మెంతులు ప్రతిరోజూ తయారుచేసుకునే వంటకాల్లో వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి వంట రుచికి మాత్రమే కాకుండా.. చర్మ అందానికి కూడా ఉపయోగపడుతాయి. మెంతుల్లో ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉంటాయి. మెంతుల్లోని ఖనిజ లవణాలు చర్మాన్ని మృదువుగా మార్చేలా చేస్తాయి. మరి ఈ మెంతులు వాడితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం...
 
3 కప్పుల నీటిలో 1 కప్పు మెంతులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీరు బాగా చల్లారిన తరువాత నీటిని మాత్రం ముఖానికి, చర్మానికి రాసుకోవాలి. ఓ 20 నిమిషాల పాటు అలానే ఉంచుకుని ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మంపై గల మృతుకణాలు తొలగిపోయి చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. దాంతో పాటు ముడతల చర్మం కూడా పోతుంది.
 
మెంతుల్లో సహజసిద్ధమైన నూనెలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ముఖచర్మాన్ని తాజాగా మార్చుతాయి. జిడ్డు చర్మాన్ని కూడా తొలగిస్తాయి. గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల మెంతులు వేసుకుని రాత్రంత నానబెట్టుకోవాలి. ఆపై ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో 2 స్పూన్ల మోతాదులో కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత వెచ్చని నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. ఇలా వారంలో మూడుసార్లు క్రమంగా చేస్తుంటే జిడ్డు చర్మం పోతుంది.