శెనగపిండి, ఆరెంజ్ పిల్ మాస్క్..?
శెనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో పావు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి.. ఒక స్పూన్ చిలికిన పెరుగు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయే వరకు వుంచి.. ఆపై మర్దన చేసి ఈ మాస్క్‌ను తొలగించాలి. మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్దకూడదు.
శెనగపిండి పసుపు మాస్క్:
మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిలో చిటెకెడు పసుపు కొన్ని చుక్కల పాలు కానీ తాజా మీగడ కానీ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము, ధూళిని తీసివేసి చర్మాన్ని తాజాగా, సున్నితంగా తయారు చేస్తుంది.