గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (18:29 IST)

రాజకీయ పార్టీలకు వాట్సాప్‌ను ఎలా వాడాలో తెలియట్లేదు.. కార్ల్

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో బల్క్ మెసేజ్‌లకు చెక్ పెట్టే దిశగా రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున వాట్సాప్ సందేశాలను పంపే ఖాతాలపై వేటు వేయాలని వాట్సాప్ నిర్ణయించుకుంది. 
 
ఇందులో భాగంగా నెలకు 20లక్షల అనుమానిత ఖాతాలను రద్దు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. తమది బ్రాట్‌కాస్ట్ ఫ్లాట్‌ఫామ్ కాదని.. దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని వాట్సాప్‌ కమ్యూనికేషన్‌ హెడ్‌ కార్ల్‌ వూగ్‌ సూచించారు. 
 
చాలా రాజకీయ పార్టీలు తమ యాప్‌ను ఎలా వాడాలో తెలియక.. దుర్వినియోగం చేస్తున్నాయని.. ఇలా చేస్తే నిషేధం విధించక తప్పదని కార్ల్ హెచ్చరించారు. వాట్సాప్ అనేది ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అని, అసహజ సందేశాలు పంపించే నెంబర్లను నిషేధించినట్లు కార్ల్ చెప్పుకొచ్చారు. ఫలితంగా వాట్సాప్ వినియోగం ఇక రాజకీయ పార్టీలకు కష్టతరం కానుందన్నమాట.