సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:03 IST)

వాట్సాప్, మెసెంజర్‌లు కలిసిపోయాయ్... కానీ...

వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ కలిసిపోతాయన్న వార్తలు రెండుమూడు రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇది నిజమా కాదా అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చాట్ సర్వీసెస్‌ని కలిపేస్తారన్న వార్తలపై స్పందించాలంటూ ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఫేస్‌బుక్‌ని వివరణ కోరింది. 
 
ఇది నిజమేనంటూ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించేశారు. వాట్సాప్-ఫేస్‌బుక్ కలిసిపోవడం నిజమే కానీ, ఇది చాలా ఎక్కువ కాలంపాటు కొనసాగే ప్రాజెక్ట్ అనీ ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యేది కాదనీ బహుశా 2020 నాటికి ఇది జరగవచ్చుననీ జుకర్‌బర్గ్ వెల్లడించారు.