శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:09 IST)

ఒక్క రాత్రికి కోటి రూపాయలిస్తాం.. ఎఫ్‌బీలో ఆమెకు వేధింపులు?

సోషల్ మీడియా ద్వారా ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే... సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా నటీమణులను ట్రోలింగ్ చేయడం, వారికి అభ్యంతరకరమైన మెసేజ్‌లో పెట్టడం వంటి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా మలయాళ నటీమణి గాయత్రి అరుణ్‌కు ఎఫ్‌బీ ద్వారా వేధింపులు అధికమయ్యాయి. 
 
గాయత్రి అరుణ్ అనే హీరోయిన్‌ అభ్యంతరకర ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మరికొంతమంది ఒక్కరాత్రికి రూ.2లక్షలు ఇస్తాం.. ఓకేనా అంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు స్పందించిన గాయత్రి.. మీ తల్లీ, సోదరి సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఇంకా సదరు యువకుడు పోస్టు చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసిన నటి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరలై కూర్చుంది. 
 
మరోవైపు ప్రముఖ టాలీవుడ్ నటి సాక్షి చౌదరికి కూడా ఇలాంటి వేధింపులకు గురిచేసే పోస్టులు వచ్చాయి. ఈమె తన సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫోటోలతో కూడిన పోస్టు చేస్తుండటంతో.. ఆమెతో ఒక్క రాత్రికి గడిపేందుకు రేటెంత అంటూ పోస్టులు పెడుతున్నారు. తన వీడియోలు, ఫోటోలను చూసి ఒక్క రాత్రికి కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నట్లు పోస్టు చేస్తున్నారని.. తాను అమ్ముడు పోయేందుకు సిద్ధంగా లేనని సాక్షి చౌదరి తెలిపింది.