1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Suffered loss of work, insults for speaking out during #MeToo: Chinmayi

రాత్రికి ఎంత తీసుకుంటావ్.. వ్యభిచారణి అంటూ.. చిన్మయి

#MeToo
మీటూ వ్యాఖ్యలపై నోరు విప్పిన గాయని చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు విప్పిన చిన్మయి.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను బయటపెట్టినందుకే తనకు అవకాశాలు రాకుండా చేశారని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తనను డబ్బింగ్ యూనియన్ నుంచి బహిష్కరించారని.. అదే సమయంలో గేయ రచయిత వైరముత్తు మాత్రం గొప్ప వ్యక్తిగా చలామణి అవుతూ సత్కారాలు పొందుతున్నారని ఫైర్ అయ్యింది. భారత సమాజంలో బాధితురాలికి న్యాయం జరగడం అంత సులభం కాదని చిన్మయి వెల్లడించింది. బాధితురాలు మరణిస్తే, హత్యకు గురయితేనే సమాజం సీరియస్‌గా పట్టించుకుంటుందని చిన్మయి వ్యాఖ్యానించింది. 
 
ప్రస్తుతం తాను సోషల్ మీడియా నుంచి అన్నిరకాల వేధింపులను ఎదుర్కొంటున్నానని.. నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారని.. ఓ రాత్రి గడిపేందుకు ఎంత తీసుకుంటావని అడుగుతున్నారని, కొందరు వ్యభిచారణి అంటూ దూషిస్తున్నారని తెలిపింది.
తర్వాతి కథనం
ఆగ్నేయ బ్రెజిల్‌‌లో ఘోరం.. ఆనకట్ట కుప్పకూలింది.. 200 మంది?