గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (19:14 IST)

మోహన్‌లాల్‌‌పై ట్రోలింగ్.. బూట్లు.. నా.. తెచ్చుకున్నారా?

2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. మలయాళ స్టార్ మోహన్ లాల్‌‌పై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 
 
40 ఏళ్ల పాటు ఇండస్ట్రీ ఉంటూ ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఆయన కేరళ సినిమాకు ఎంతో చేశారని, ఆయనకు కాకపోతే ఇంకెవరికి పద్మభూషణ్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. 
 
అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా జరుగుతున్న రచ్చ చూసి అంతా బాధ పెడుతున్నారు. పద్మ అవార్డ్ వచ్చినప్పుడు చక్కగా ఇండస్ట్రీ అంతా కలిసి ఆయనకు సన్మానించడం మానేసి ఇట్టి తిట్టి పోస్తారా.. అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. 
 
కేర‌ళ‌లో ప్రేమ్ న‌జీర్ త‌ర్వాత ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న న‌టుడు మోహ‌న్ లాల్ మాత్ర‌మే. అయితే ఆయ‌న బిజేపీకి ఊడిగం చేసి.. మోదీకి భ‌జ‌న చేసి ఈ అవార్డు తెచ్చుకున్నారంటూ చాలా దారుణ‌మైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇంకా కాలాపాణి సినిమాలో మోహన్ లాల్ బూట్లు నాకుతున్న ఫోటోలు పెట్టి.. పక్కనే మోదీని చూపిస్తూ మోహన్ లాల్ పరువు తీస్తున్నారు. 
 
గతంలో విశ్వ‌శాంతి కోసం చేస్తున్న ఉద్య‌మంలో భాగంగా ప్ర‌ధాని నరేంద్ర మోదీని మోహన్ లాల్ కలిసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.