శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (11:43 IST)

ఓలా క్యాబ్‌లో ప్రయాణించండి... 15 రోజుల తర్వాత చెల్లించండి...

దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఓలాకు ఒకటి. అతి తక్కువ చార్జీలకే కారు ప్రయాణ సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చిన సంస్థగా గుర్తింపు వుంది. అలాంటి ఓలా క్యాబ్ సంస్థ తాజాగా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ పేరిట సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఈ సేవల ప్రకారం.. ఓలా క్యాబ్‌లో ప్రయాణం చేసిన తర్వాత 15 రోజుల్లోపు ఎపుడైనా ప్రయాణ చెల్లింపులు చేయవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా విడివిడిగా కూడా చెల్లించవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ తరహా ఆవకాశం కొంతమంది కస్టమర్లకే అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. 
 
నిజానికి గత యేడాది పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నెల నెలా కస్టమర్లు 30 శాతం మేరకు వృద్ధి చెందారు. అందుకే పూర్తి స్థాయిలో త్వరలోనే 15 కోట్లకుపైగా కస్టమర్లకు ఈ సేవలను అందించాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లకే ఈ సేవలను అందిస్తోంది. క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్న తర్వాత 15 రోజుల్లోపు ఎలాంటి పాస్ వర్డ్, ఓటిపి అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.