గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 17 జనవరి 2019 (13:04 IST)

హల్లో కోహ్లీ... మీ ఆవిడకు మీరైనా చెప్పొచ్చుకదా.. ఏంటాపని?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. జంతు పరిరక్షణ సంస్థ (పెటా)తో చేతులు కలిపి మాంసాహారాన్ని దూరంగా ఉంచాలని ప్రచారం చేస్తోంది. మరోవైపు, నోటి కేన్సర్‌కు కారణమయ్యే పాన్ మసాలా ప్రకటనలో నటించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
పాన్ మసాలాలు విక్రయించే రజనీగంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ విక్రయ వ్యాపారం కూడా చేస్తోంది. వీటిని ప్రమోట్ చేసే యాడ్‌లో అనుష్క నటిస్తోంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. పాన్ మసాలాలతో ఎంతో మందిని నోటి క్యాన్సర్ల బారిన పడేస్తున్న సంస్థను ప్రమోట్ చేస్తావా? అంటూ అనుష్కపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
అదేసమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలాంటి సుపారీలను ప్రోత్సహిస్తూ మళ్లీ జనాలకు నీతులు చెబుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టయ్యారు. అంతేనా, ఈ యాడ్‌లో నటించవద్దని అనుష్కకు మీరైనా చెప్పండి కోహ్లీ అంటూ మరో నెటిజన్ కోరాడు.