1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Heard Loud Noise 30 Seconds Into Flight : Air India Dreamliner Crash Survivor

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

viswa kumar ramesh
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 241 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం బయటపడ్డారు. 40 యేళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అతడి ఛాతీ, కళ్లు, పాదాలకు మాత్రం గాయలయ్యాయి. 
 
టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినిపిచింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అని విశ్వాస్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. భయంతో వణికిపోయాను. వెంటనే లేచి పరుగెత్తాను. విమాన శకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడివున్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లోకి ఎక్కించి ఇక్కడకు తీసుకొచ్చారు అని తెలిపారు. పైగా, తన వద్ద ఉన్న బోర్డింగ్ పాస్‌ను కూడా విశ్వాస్ చూపించారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Chandra Babu: రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. టీడీపీ