శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (10:41 IST)

విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడా? అనుష్క ఫోటో వైరల్..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ అందాల సుందరి అనుష్క శర్మ వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ.. త్వరలోనే తండ్రి కాబోతున్నాడని.. అనుష్క తల్లి అయ్యిందని.. వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయం తేలలేదు. 
 
సినిమాలతో బిజీ బిజీగా వుండటంతో పిల్లల విషయంలో అనుష్క కొన్నేళ్లు గ్యాప్ తీసుకుందామన్నా.. కోహ్లీకి పిల్లలంటే ఇష్టముండటంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారని.. ఇందులో భాగంగానే ఆమె తల్లి కాబోతోందని టాక్ వస్తోంది. 
 
తాజాగా అనుష్కకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను చూస్తే అనుష్క గర్భవతి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు కోహ్లీ కానీ అనుష్క కానీ స్పందించలేదు. ఈ వార్త నిజమైతే విరుష్క ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు.