సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:55 IST)

గోవా బ్యూటీ ఇలియానా గర్భందాల్చిందా...

గోవా బ్యూటీ ఇలియానా సినీ అవకాశాలు లేకపోవడంతో తన ప్రియుడుతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. నిజానికి తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో ఆమె పెళ్లి చేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ వీటిపై ఆమె ఎక్కడా స్పందించలేదు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల ముంబైలోని బాంద్రా ఏరియాలో కూరగాయలు కొంటూ కెమెరా కంటికి చిక్కింది. సాధారణంగా బక్కగా ఉండే భామ ఆ ఫోటోల్లో  కాస్త బొద్దుగా కనబడేసరికి పలు రకాలు పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
కొందరు ఆండ్రూ నీబోన్‌తో పెళ్ళి తర్వాత కాస్త ఒళ్ళు చేసిందంటే మరికొందరు మాత్రం ప్రెగ్నెంట్ అయిందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళిని అయితే దాచిపెట్టడం సాధ్యం కానీ గర్భాన్ని దాచిపెట్టడం అసాధ్యమంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఘనత సాధించింది. ఇలియానా ఫాలోయర్ల సంఖ్య 9 మిలియన్స్ దాటడంతో ఉబ్బితబ్బిబ్బైన ఇల్లీ బేబీ తన ఆనందాన్ని ఒక పాత ఫోటో పోస్ట్ చేసి మరీ పంచుకుంది. ఈ పాత ఫోటోకు '9 మిలియన్ లవ్.. యూ గైస్' అంటూ క్యాప్షన్ పెట్టింది.