శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (11:35 IST)

టూ పీస్ వైట్ బికినీ.. ట్రాన్స్‌పరెంట్ జర్కిన్‌లో ఇలియానా ఫోజు

సన్నని నాజూకు నడుముతో బక్కపల్చని సౌందర్యంతో ఫ్రెష్ బ్యూటీగా తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా. 12 సంవత్సరాల క్రితం అంటే 2006లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' చిత్రంలో రామ్ సరసన నటించింది. అపుడ

సన్నని నాజూకు నడుముతో బక్కపల్చని సౌందర్యంతో ఫ్రెష్ బ్యూటీగా తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా. 12 సంవత్సరాల క్రితం అంటే 2006లో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' చిత్రంలో రామ్ సరసన నటించింది. అపుడే టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ గోవా బ్యూటీ.
 
ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు అంతటివాడు కూడా మనసు పారేసుకుని 'పోకిరి'లో బుక్ చేసుకున్నాడు. చాలాకాలం అగ్ర హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసిన ఇలియానా గత ఐదారేళ్ళగా కొత్త హీరోయిన్ల తాకిడికి ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్‌కు కనుమరుగైపోయింది. 
 
కానీ బాలీవుడ్‌లో మాత్రం అడపాదడపా కనిపిస్తోంది. ఆ మధ్య రెండు మూడు తెలుగు సినిమాలు ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజతో "అమర్ అక్బర్ ఆంటోనీ"తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఇలియానా సిద్ధమైంది. ఈ చిత్రం టాలీవుడ్‌లో మళ్లీ గట్టి బ్రేక్ అవుతుందన్న నమ్మకంతో ఇలియానా ఉంది. సరే ఛాన్సులు లేవు కదా అని ఇలియానా తన శరీరం మీద ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు. 
 
దీన్ని రుజువు చేసేలా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటో ఒకటి షేర్ చేసుకుంది. వైట్ టూ పీస్ బికినీలోపైన ట్రాన్స్‌పరెంట్ జర్కిన్‌తో ఇలియానా ఇచ్చిన స్టిల్ అభిమానులను ఫిదా చేసేస్తోంది. గల గల గోదారి పాటలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా నడుమును అలాగే మెయింటైన్ చేయటం చూసి ఫ్యాన్స్  ఆశ్చర్యపోతున్నారు. ఇలా అనుమానం వస్తుందని ముందే ఊహించింది కాబోలు ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్ ఫోటో షాప్ వాడలేదని ముందే క్లారిటీ ఇచ్చేస్తోంది. 
 
సో రవితేజ 'ట్రిపుల్ ఏ'లో కూడా ఇలాంటివి ఆశించవచ్చన్న సంకేతాలు ఇచ్చినట్టుగా వుంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన "కిక్" బ్లాక్ బస్టర్‌గా నిలవగా ఆ తర్వాత చేసిన 'ఖతర్నాక్', 'దేవుడు చేసిన మనుషులు' ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు ఇది కనుక హిట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేయొచ్చనే అంచనాలో ఉంది ఇలియానా.