శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (17:33 IST)

పక్కలో పడుకుంటేనే సినీ ఛాన్స్.. తప్పుచేసి బయటకు చెప్పకూడదు : నటి ప్రియ భవానీ శంకర్

క్యాస్టింగ్ కౌచ్‌పై తమళ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ స్పందించింది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేధింపులు ఉన్న మాట నిజమేనని చెప్పింది. అయితే, ఏదైనా మనం సమ్మతిస్తేనే జరుగుతుందన్నారు.

క్యాస్టింగ్ కౌచ్‌పై తమళ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ స్పందించింది. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదా లైంగిక వేధింపులు ఉన్న మాట నిజమేనని చెప్పింది. అయితే, ఏదైనా మనం సమ్మతిస్తేనే జరుగుతుందన్నారు.
 
కాగా, బుల్లితెరపై ఇప్పటిదాకా సందడి చేసిన ప్రియ, ఇప్పుడిప్పుడే వెండి తెరపై బిజీ అవుతోంది. ఇలీవలే కార్తీకి జంటగా ఓ చిత్రంలో నటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమేనని స్పష్టంచేసింది. 
 
ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయని ప్రియ చెప్పింది. అయితే, వాటిని అంగీకరించడం, నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. తప్పు చేసి, బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. వేధింపుల బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని తెలిపింది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదని చెప్పింది.